: మెయిల్ హ్యాక్ చేసి.. రూ. 2.35 కోట్లు నొక్కేశారు


సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్ని పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నా... దుండగులు మాత్రం చెలరేగిపోతున్నారు. తాజాగా, ఓ వ్యాపార సంస్థకు చెందిన మెయిల్ ను హ్యాక్ చేసి ఏకంగా రూ. 2.35 కోట్ల రూపాయలను స్వాహా చేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగింది. స్థానికంగా ఉన్న ఇండియన్ టొబాకో ట్రేడర్స్ (ఐటీటీ) ఫిబ్రవరి 28, నవంబర్ 11వ తేదీల్లో బల్గేరియాలోని డెల్కామ్ కంపెనీకి దాదాపు 275 టన్నుల పొగాకును ఎగుమతి చేసింది. ఈ సంస్థ లావాదేవీలన్నీ ఒంగోలులోని విజయా బ్యాంకు ఖాతాకు నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతాయి.

ఈ నేపథ్యంలో, ఎగుమతి చేసిన సరుకుకు సంబంధించిన నగదు గురించి ఐటీటీ యాజమాన్యం బల్గేరియాలోని డెల్ కామ్ ప్రతినిధుల్ని సంప్రదించారు. అయితే, అప్పటికే మొత్తం నగదును ఐటీటీ ఖాతాలో జమ చేసినట్టు అటువైపు నుంచి సమాధానం వచ్చింది. వెంటనే, ఖాతా వివరాలను పరిశీలించగా టర్కీలోని ఒక ఇన్వెస్ట్ మెంట్ అండ్ ట్రేడర్స్ బ్యాంకు ఖాతాకు ఈ మొత్తం జమయినట్టు గుర్తించారు. ఈ క్రమంలో ఐటీటీ బ్యాంకు ఖాతా హ్యాక్ అయినట్టు కనుగొన్నారు.

  • Loading...

More Telugu News