: విశాఖ తీరానికి 1200 కి.మీ దూరంలో లెహర్ తుపాను
బలమైన తుపాను లెహెర్ విశాఖ తీరానికి 1200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 28న కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని, అన్ని పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బలమైన తుపానుగా మారిన లెహెర్ తీరాన్ని సమీపించే కొద్దీ ప్రమాద తీవ్రత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల కోస్తాంధ్రపై ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంటున్నారు.