: పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు... పోలింగ్ కు అంతరాయం
మధ్యప్రదేశ్, మిజోరాంలలో శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. హోరాహోరీగా జరిగిన ప్రచారం అనంతరం ఈ రోజు పోలింగ్ ప్రారంభమైంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దీంతో, పోలింగ్ బూత్ ల వద్ద భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను చేశారు. అయినప్పటికీ అక్కడక్కడ దుండగులు చెలరేగిపోతూనే ఉన్నారు. మధ్యప్రదేశ్ భిండ్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆగంతుకులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇక్కడ 15 నిమిషాల పాటు పోలింగ్ కు అంతరాయం కలిగింది.