: చర్మం కూడా కృత్రిమమే!


మూల కణాలతో పలు శరీర అవయవాలను తయారుచేయవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. గుండె, కాలేయం, మూత్రపిండాలు ఇలా మూల కణాలతో పలు శరీర అవయవాలను ఇప్పటికే తయారుచేశారు. ఇప్పుడు కృత్రిమ చర్మాన్ని శాస్త్రవేత్తలు తయారుచేశారు. తీవ్రంగా కాలిన గాయాల పాలైనవారికి చర్మం అనేది మామూలుగా ఉండదు. ఇలాంటి వారి పాలిటి ఈ కృత్రిమ చర్మం నిజంగా ఒక వరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గ్రనడా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు బొడ్డు తాడు నుండి సేకరించిన మూల కణాలను ఉపయోగించి కృత్రిమ చర్మాన్ని అభివృద్ధి చేశారు. ఈ చర్మం కాలిన గాయాలపాలైన వారికి ఒక వరంలాగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి గాయాలపాలైనవారు చక్కగా కోలుకుని కొత్త చర్మం రావడానికి చాలా సమయం పడుతుందని, బాధితుల ఆరోగ్యకరమైన చర్మం నుండే కొత్త చర్మం పెరగాల్సి ఉంటుందని తెలిపారు. అదే మూలకణం నుండి తయారుచేసిన కృత్రిమ చర్మం వినియోగించడం వల్ల కాలిన గాయాలు సత్వరం మానిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News