: ఈ యంత్రం డాక్టర్లకు చక్కగా ఉపయోగపడుతుంది


డాక్టర్లకు బోలెడు యంత్రాలు ఉపయోగపడతాయి. అయితే ప్రసవం జరిగే సమయంలో సుఖ ప్రసవం జరుగుతుందా? లేక, సిజేరియన్‌ చేయాల్సిన అవసరం ఉంటుందా? అనే విషయంలో వైద్యులకు అప్పుడప్పుడూ సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి శాస్త్రవేత్తలు ఒక సరికొత్త యంత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ యంత్రం ప్రసవాన్ని గురించి డాక్టర్లకు తగు సూచనలిస్తుందని దీన్ని తయారుచేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా కాన్పు సమయంలో ఏవైనా అవరోధాలు ఏర్పడితే వాటిని గురించి సరిగా వైద్యులు ఒక్కోసారి అంచనా వేయలేరు. ఇలాంటి వాటికోసమే ఈ త్రీడీ యంత్రాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ యంత్రంలోని సాఫ్ట్‌వేర్‌ పూర్తిగా తొమ్మిది నెలలు నిండిన మహిళల శరీర నిర్మాణాన్ని, గర్భంలోని బిడ్డ కదలికలను గమనించి ప్రసవానికి సంబంధించి డాక్టర్లకు తగు సూచనలను చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే ప్రసవం జరిగే విధానం, తల్లి కటిభాగం, బిడ్డ తల, శరీర భాగాల పరిమాణాలను తెలియజేస్తుంది. జనన మార్గంలో బిడ్డకు ఏవైనా అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉందా? అనే విషయాన్ని కూడా ఈ త్రీడీ యంత్రం తెరపై చూపిస్తుందని ఈస్ట్‌ అంగ్లియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ రూడీ లాపీర్‌ తెలిపారు. ప్రసవం కష్టమైనప్పుడు, సిజేరియన్‌ సమయంలో డాక్టర్లకు ఉపయోగపడేలా ఇందులోని సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశామని రూడీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News