: ఆ వర్షాలవల్లే జీవరాశులు అంతరించాయట


ఒకప్పుడు భూమిపైన విపరీతంగా ఉన్న భూచరాలు తర్వాత కాలంలో అంతరించిపోయాయి. దీనికి కారణాలు ఏమైవుంటాయా? అని శాస్త్రవేత్తలు అన్వేషణ సాగించారు. చివరికి ఆమ్ల వర్షాల కారణంగా భూమిపైన ఉన్న భూచరాలు అంతమైపోయాయని ప్రత్యేక అధ్యయనంలో తేల్చారు.

భూమిపైన వేల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న భూచరాలు, జల చరాలు పెద్ద సంఖ్యలో అంతరించిపోయాయి. దీనికి కారణాలను గురించి శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై కురిసిన ఆమ్ల వర్షాలు, ఓజోన్‌ పొర దెబ్బతినడం వంటివి కారణంగా తేలాయి. ఈ కారణాలవల్లే 90 శాతం జలచరాలు, 70 శాతం భూచరాలు అంతరించి పోయాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. సైబీరియా ప్రాంతంలో అగ్నిపర్వతం విస్ఫోటనాలు కూడా అక్కడి జీవరాశులు భారీ సంఖ్యలో అంతరించిపోవడానికి కారణమైనాయి. వీటినే సైబీరియా ట్రాప్స్‌గా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమిపై సంభవించిన ఈ విస్ఫోటనాల నేపథ్యంలో తలెత్తిన వాతావరణ దుష్ఫ్రభావాలు భూమిపైని జీవరాశులకు ప్రాణాతంకమైనాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News