: రేపు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా రేపు ఢిల్లీ వెళ్లనున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ ముగిసిన తరువాత ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలను 119 స్థానాల నుంచి 153 స్థానాలకు పెంచాలని జీవోఎం ను కోరనున్నామని తెలిపారు. కేబినెట్ కు సమర్పించే బిల్లులో ఈ అంశాన్ని పొందుపరచాలని సూచిస్తామని ఆయన చెప్పారు.