: రాయల తెలంగాణ మా కొద్దు: కోదండరాం


సీమాంధ్ర నాయకులు చేస్తున్న రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీజేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. కరీంనగర్ జిల్లా రాంపూర్ లో జరిగిన డీటీఎఫ్ రాష్ట్ర ప్రధమ విద్యామహాసభల్లో ఆయన మాట్లాడుతూ కేంద్రం రాయల తెలంగాణ అంటే కొట్లాటకు సిద్ధమని స్పష్టం చేశారు. హైదరాబాద్ వికాసం తెలంగాణతోనే ముడిపడి ఉందని అందుకే తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగమన్నారు. ముఖ్యమంత్రి తన భూములు, ఇళ్ల సంరక్షణకోసం హైదరాబాద్ లో అధికారం చెలాయించాలని చూస్తున్నారని కోదండరాం ఆరోపించారు. రాజ్యాంగ వ్యతిరేకంగా సీఎం చేస్తున్న కుట్రను శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ మంత్రులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News