: ఏపీ భవన్ వద్ద 'ఎమ్మెల్సీ' ఆశావహుల సందడి
ఎమ్మెల్సీ టిక్కెట్లు సాధించుకునేందుకు, ఆశావహులు, ఎవరికి తోచిన ప్రయత్నాలు వాళ్లు మొదలుపెట్టారు. దీంతో ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ ఛీఫ్ బొత్స తదితరులు ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.
కిరణ్, బొత్స.. అధిష్ఠానంతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై ఆమోద ముద్ర వేయించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయమై కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ తో కిరణ్, బొత్స చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సాయంత్రానికి తుది జాబితా ఖరారవుతుందని భావిస్తున్నారు.