: ఎంపీ కునాల్ ఘోష్ కు 5 రోజుల పోలీసు కస్టడీ


పశ్చిమబెంగాల్ లో శారదా గ్రూపు చిట్ ఫండ్ కుంభకోణంలో అరెస్టయిన బహిష్కృత తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కునాల్ ఘోష్ ను న్యాయస్థానం 5 రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎంపీని స్థానిక కోర్టులో హాజరుపరచగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన న్యాయస్థానం పోలీసు కస్టడీకి అప్పగించింది. కాగా శారదా గ్రూపు మీడియా విభాగం సీఈవోగా వ్యవహరించిన ఆయనపై చీటింగ్ సహా పలు అభియోగాలు మోపారు. కునాల్ ఘోష్ ను నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News