: అరకేజీ బంగారం.. 25 ద్విచక్రవాహనాలు స్వాధీనం
గుంటూరు జిల్లా రొంపిచర్ల, శావల్యాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 లక్షల విలువ చేసే అరకిలో బంగారం, 25 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని జిల్లా రూరల్ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వేల్పూరు గ్రామానికి చెందిన రామకృష్ణ అనే దొంగతో పాటు మరో ముగ్గురు 25 ద్విచక్రవాహనాలను చోరీ చేశారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న కావేరీ బస్సులో అరకిలో బంగారాన్ని బస్సు డ్రైవర్ శ్రీనివాస్ దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రొంపిచర్ల పోలీసులు అతని నుంచి 420 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరి కొంత బంగారం బ్యాంకులో ఉందని, త్వరలో స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో చోరీ సొమ్ము రికవరీ చేసిన పోలీసు సిబ్బందికి అవార్డులు ఇప్పిస్తామని ఎస్పీ తెలిపారు.