: కాంగ్రెస్ పాలనలోనే పేదలు అభివృద్ధి చెందారు: మంత్రి ఆనం
కాంగ్రెస్ పాలనలోనే అన్ని రంగాల్లో పేద ప్రజలు అభివృద్ధి చెందారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఆయన వివరించారు. రాపూరులో కొత్తగా మంజూరైన కేంద్ర సహకార బ్యాంకును, 25 లక్షలతో కొత్తగా నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని ప్రారంభించారు. కోటీ 62 లక్షలతో నిర్మించనున్న ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ వసతి గృహ అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.