: బంగారు తల్లి పథకానికి 93 వేల మంది పేర్లు నమోదు చేశారు: సీఎం
బంగారుతల్లి పథకం కింద ఇప్పటి వరకు 93 వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా నార్పలలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా ఎస్సీ ఎస్టీల ఉప ప్రణాళికను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి రఘువీరా రెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.