: తీవ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపండి: అధికారులకు పాక్ ప్రధాని ఆదేశం


ఉగ్రవాదాన్ని ఎగదోయడంలో సిద్ధహస్తురాలైన పాకిస్తాన్ ఇప్పుడు ఇంటిని చక్కదిద్దుకునే పనిలో నిమగ్నమైంది. దేశంలో నానాటికీ తీవ్రవాద దాడులు పెరగడం, తెహ్రీక్-ఏ-తాలిబాన్ వంటి మత ఛాందస సంస్థల ఆగడాలు మరీ పెచ్చుమీరుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్టవేసేందుకు పాక్ ప్రభుత్వం నడుం బిగించింది.

నిషిద్ధ తీవ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపాలని పాక్ ప్రధాని రజా పర్వేజ్ అష్రాఫ్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే కరాచీలో చోటు చేసుకున్న విధ్వంసం నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ, అధ్యక్షుడు అయినా నిషిధ్ద ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోమనే చెబుతారని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి పక్షపాతానికి తావులేదని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News