: రోహిత్ అవుట్... భారత్ 21/1
టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ బౌలర్ రవి రాంపాల్ వేసిన బంతిని కట్ చేయబోయిన రోహిత్ ఎడ్జ్ అవడంతో రెండో స్లిప్ లో ఉన్న స్యామికి చిక్కాడు. దీంతో లోకల్ బాయ్ అంటూ అతని విన్యాసాలు తిలకించాలని వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. తాతగారి స్వస్థలంలో అలరిస్తాడని ఊహించిన రోహిత్ కేవలం 12 పరుగులే సాధించి నిరాశపరచడంతో ధావన్(7) కు కోహ్లీ జత కలిశాడు. దీంతో భారత జట్టు 5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.