: కాసేపట్లో రోహిత్ తాతగారి ఊర్లో మ్యాచ్
ప్రతి ఒక్కరికి తాతగారి ఇళ్లన్నా, ఊరన్నా ఓ ప్రత్యేక అభిమానం ఉంటుంది. అలాగే ఆ ఊరు కూడా అతనిని అలాగే అభిమానిస్తుంది. ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మది ప్రస్తుతం అలాంటి పరిస్థితే. మహారాష్ట్రకు చెందిన రోహిత్ శర్మది మరో స్వస్థలం విశాఖే. రోహిత్ తల్లిది విశాఖపట్టణం. దీంతో రోహిత్ శర్మ నేటి మధ్యాహ్నం జరుగనున్న మ్యాచ్ లో రాణించాలని విశాఖపట్టణం కోరుకుంటోంది. విసీఏ-విడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఇప్పటి వరకు భారత్ ఆడిన ఏ మ్యాచ్ లోనూ ఓటమి చెందలేదు. ఇక్కడే ధోని కెరీర్ కు బ్రేక్ వచ్చింది. గత వన్డేలో యువీ వీరవిహారం చేశాడు. ఈసారి ఎవరు అలరిస్తారో చూడాలి. వాతావరణం పొడిగా ఉంది. వర్షం ముప్పు ఉన్నప్పటికీ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో 300 పైచిలుకు స్కోర్ నమోదయ్యే అవకాశం ఉందని క్యూరేటర్ తెలిపారు.