: జడ్జిని కదిలించిన బాధితురాలు


దేశంలో పేదరికం రూపుమాపేస్తామంటున్న రాజకీయనాయకులు సిగ్గుతో తల దించుకోవాల్సిన ఘటన రామనాథపురం లోక్ అదాలత్ లో చోటు చేసుకుంది. మేకలు కొనుక్కునేందుకు ఓ మహిళ పదేళ్ల క్రితం ఆరు వేల రూపాయలు అప్పు చేసింది. తదనంతరం ఆమె జీవనం మరింత దుర్భరంగా మారింది. అది చెల్లించలేక ఆమె గత పదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతోంది. నిన్న జరిగిన లోక్ అదాలత్ లో బ్యాంకు వారు ఆమెపై కేసును సబ్ జడ్జికి వివరించారు.

దీంతో బ్యాంకు ప్రతినిధులు ఆమె రెండు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని జడ్జికి తెలిపారు. ఆ మేరకు తీర్పు విన్న బాధితురాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కోర్టు ఆవరణలోనే తన దీన స్థితిని, నిస్సహాయతను జడ్జికి వెల్లడించింది. దీంతో ఆమె ఆక్రందనలోని నిజాయతీ, డబ్బు చెల్లించలేని ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న సబ్ జడ్జీ తానే ఆ మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించారు. దీంతో పదేళ్ల పాటు బ్యాంకుకు, మహిళకు మధ్య కొనసాగిన వివాదం ముగిసింది.

  • Loading...

More Telugu News