: ప్రయోగాలకు ముందు ఇస్రో బాలాజీ ఆశీస్సులు తీసుకోవడం మూర్ఖత్వం: సీఎన్ఆర్ రావు
ప్రముఖ శాస్త్రవేత్త, ఇటీవలే భారతరత్న పురస్కారానికి ఎంపికైన సీఎన్ఆర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. రాజకీయ నేతలను ఇడియట్ అంటూ నోరుజారి తర్వాత తూచ్ నేనలా అనలేదంటూ మాట మార్చారు. ఐటీ సెక్టార్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఇస్రో చర్యను తప్పుబట్టారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో ఉపగ్రహ ప్రయోగానికి ముందు.. ఉపగ్రహ నమూనాను ఇస్రో చైర్మన్ తిరుమల వేంకటేశ్వరుడి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. దీనిని సీఎన్ఆర్ రావు తప్పుబట్టారు. ఇదొక మూఢనమ్మకంగా పేర్కొన్నారు. దీన్ని తాను నమ్మనన్నారు. 'దేవుడిని కోరకుంటే తమ తమ పనులు ఫలిస్తాయని మానవులు నమ్ముతుంటారు. కానీ, నేనలాంటివి నమ్మను. జ్యోతిషాన్ని కూడా నమ్మను' అని బదులిచ్చారు.