: రాజస్థాన్ లో కాంగ్రెస్ కు అధికారాన్ని ఇవ్వండి: సోనియా


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ రోజు రాజస్థాన్ లో ప్రచారం చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ కు అధికారాన్ని కట్టబెట్టాలని ఇక్కడి కోటా పట్టణంలో జరిగిన ర్యాలీలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లుగా అశోక్ గెహ్లట్ నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ అభివృద్ధి వేగంగా జరిగిందని సోనియా పేర్కొన్నారు. జోథ్ పూర్ లో ఐఐటీ, ఉదయ్ పూర్ లో ఐఐఎం, అజ్మీర్ లో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని ఆమె హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు.

  • Loading...

More Telugu News