: కోర్టులో బాంబు కలకలం
హైదరాబాద్ జంట పేలుళ్ల ఘటన తర్వాత ఉత్తుత్తి బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టులోనూ బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ప్రారంభించారు.
సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్ హుటాహుటీన రంగంలోకి దిగింది. క్షుణ్నంగా పరిశీలించిన మీదట ఎలాంటి బాంబు లేదని నిర్థారించారు. దీంతో, అక్కడున్న న్యాయవాదులు తదితరులు ఊపిరి పీల్చుకున్నారు.