: వోల్వో బస్సులో పొగలు
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్ పోస్టు వద్ద పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ వొల్వో బస్సులోంచి పొగలు వచ్చాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణీకులను బస్సులోంచి దించేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.