: విభజనకు సహకరిస్తున్నందుకే జగన్ కు బెయిల్: సీఎం రమేశ్


రాష్ట్ర విభజన, జగన్ బెయిల్ వ్యవహారానికి మధ్య సంబంధం ఉందంటూ తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నందుకే.. అతనికి బెయిల్ వచ్చేలా కాంగ్రెస్ సాయపడిందని ఆరోపించారు. రాష్ట్రపతిని జగన్ తరచుగా కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఆర్థిక నేరస్థులకు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఇస్తే... ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళుతుందని ప్రశ్నించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రమేష్ మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తుపై వైఎస్సార్సీపీ తప్ప అన్ని పార్టీలు పార్లమెంటులో పోరాటం చేశాయన్న రమేశ్... ఆ పార్టీ మాత్రమే ఎందుకు దూరంగా ఉందని నిలదీశారు. సోనియా ఇంటిముందు ధర్నా చేస్తే.. విభజన ఆగిపోతుందని జగన్ కు చెప్పామన్నారు.

  • Loading...

More Telugu News