: కాంగ్రెస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు: జేడీ శీలం
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. అయితే ఎప్పటికైనా ప్రజలకు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. హైదరాబాద్ ను యూటీ చేయకపోతే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని కేంద్ర హోంమంత్రి షిండేకి స్పష్టం చేసినట్టు తెలిపారు.