: విమానంలోనూ మోగనున్న సెల్ ఫోన్లు
విమానమెక్కితే సెల్ ఫోన్ మూగబోవడమే మనకిప్పటి వరకు తెలుసు. ఎందుకంటే విమానంలో సెల్ ఫోన్ వాడకం నిషేధం కాబట్టి. రానున్న రోజుల్లో ఈ నిబంధనకు కాలం చెల్లనుంది. ఎందుకంటే, విమానంలో సెల్ ఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. విమానంలోని ప్రయాణికులు సెల్ ఫోన్ వినియోగించుకునేలా చేయాలనుకుంటున్నట్టు ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ టోమ్ వీలర్ తెలిపారు. వచ్చే నెల 12న జరిగే కమిషన్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.