: భారత వృద్ధిరేటును పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: ప్రధాని


ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్..  ప్రభుత్వ విధానాలను సమర్ధించారు. తమ యూపీఏ ప్రభుత్వం వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్ధిక వ్యవస్థని ప్రవేశపెట్టిందని చెప్పారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల సమయంలో మాట్లాడిన ప్రధాని.. భారత వృద్ధిరేటును పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.

వచ్చే రెండు మూడేళ్లలో 7 నుంచి 8 శాతం వృద్ధిరేటును తిరిగి చేరుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన దృష్టి అభివృద్ధే అన్న మన్మోహన్..  ఆర్ధిక సంస్కరణల అమలులో ఎలాంటి మార్పు ఉండదన్నారు. ప్రజల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో గర్వపడుతున్నట్లు చెప్పారు.

ఎన్ సీటీసీపై ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని రాష్ట్రాలతో మాట్లాడతామన్న ఆయన ఉగ్రవాదంపై అన్ని పార్టీల ఐక్యతను ప్రశంసించారు. కాగా శ్రీలంకలో తమిళుల పరిస్థితిపై సభలో ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని..  తమిళుల సంక్షేమానికి లంక సర్కార్ తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News