: ప్రవాసాంధ్రుల కోసం ఎన్నారై పోర్టల్
ప్రవాసాంధ్రుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పోర్టల్ ను ఏర్పాటు చేసింది. ఇతర దేశాల్లో ఉంటున్న మన రాష్ట్రవాసుల వివరాలను తెలుసుకోవడానికి దీన్ని ప్రారంభించింది. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఈ పోర్టల్ (www.apnri.ap.gov.in)ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా సర్టిఫికేట్ల ఆథెంటికేషన్ ను ఆన్ లైన్ లోనే చేసుకునే సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఏయే దేశాల్లో మన రాష్ట్రవాసులు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడానికి కచ్చితమైన వ్యవస్థ లేదు. ఇప్పుడు ఈ పోర్టల్ సాయంతో రాష్ట్రవాసులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంత మంది ఉన్నారు, ఏమేం చేస్తున్నారు? అనే దానిపై సమగ్ర సమాచారాన్న పొందవచ్చని మంత్రి తెలిపారు. ఏన్నారైల సమస్యలు తీర్చేందుకు కూడా ఈ పోర్టల్ ఓ వేదిక అవుతుందని శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.