: జగన్ కు రాష్ట్రపతి అపాయింట్ మెంట్ ఎలా ఇస్తున్నారు: సోమిరెడ్డి


పది ఛార్జిషీట్లలో మొదటి ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి రెండు సార్లు ఏ విధంగా అపాయింట్ మెంట్ ఇచ్చారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రపతి ఇలా వ్యవహరించడం వల్ల సాక్షులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జగన్ ఎక్కడికి వెళ్లాలని అనుమతి కోరినా సీబీఐ రెడ్ కార్పెట్ పరుస్తూ అనుమతులు ఇస్తోందని విమర్శించారు. ఈ రకంగా సీబీఐ వ్యవహరించాలనుకుంటే, దాన్ని మూసేయడమే మంచిదని సలహా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసి ఆరునెలలు అవుతున్నా ఇంతవరకూ ప్రోరోగ్ చేయకుండా సభాపతి నాదెండ్ల మనోహర్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆనాడు ఆయన తండ్రి నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ ను మోసం చేస్తే, ఈనాడు రాష్ట్ర ప్రజలకే ఆయన ద్రోహం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ సోమిరెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News