: మిజోరంలో.. శాంతి శాంతి
సోమవారం(ఈ నెల 25న) మిజోరం రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో ఒక్క హింసాత్మక సంఘటన జరగలేదని ఆ రాష్ట్ర డీజీపీ అమూల్య పట్నాయక్ తెలిపారు. అయితే, ఈ ప్రశాంతతకు కారణం.. ప్రెస్బిటేరియన్ చర్చి నియంత్రిత మిజోరం పీపుల్స్ ఫోరం అని చెప్పుకోవచ్చు. ఈ ఫోరమే రాజకీయ పార్టీలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అంటూ నిర్దేశించింది. తమకు స్థానికంగా అన్ని ప్రాంతాల్లోనూ సిబ్బంది ఉన్నారని, రాజకీయ పార్టీల ప్రతీ చర్యను గమనిస్తుంటామని మిజోరం పీపుల్స్ ఫోరం అధ్యక్షుడు రెవ్ లల్ రమ్ నియాన్ చెప్పారు.