: ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపుపై జయసుధ అలక.. రాజీనామా చేసే అవకాశం?
త్వరలో జరగనున్న ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తన రాజకీయ ప్రత్యర్థి మాజీ మేయర్ బండ కార్తీక వర్గానికి ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తే రాజీనామా చేసేందుకు సైతం వెనుకాడనని సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ అలకబూనినట్టు సమాచారం.
గత కొంతకాలంగా బండ కార్తీక వర్గంతో వైరం నెరపుతున్న జయసుధ ఈసారి గట్టి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కార్తీకకు మేయర్ పదవి ఇచ్చిన సమయంలోనే జయసుధ భగ్గుమందిట.
అయితే, కార్తీక కుటుంబానికి సీఎం కిరణ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో జయసుధ మాట చెల్లుబాటు అయ్యేట్టు కనిపించడంలేదు. ఇంతకుముందు వైఎస్పార్సీపీ వైపు దృష్టి సారించి ముఖ్యమంత్రికి అనుగ్రహానికి దూరమైన ఈ సినీ నటి తన మాట నెగ్గకపోతే ఏం చేస్తుందో.. !.