: అసెంబ్లీ తీర్మానం తర్వాతే విభజన జరగాలని రాష్ట్రపతిని కోరాం: జగన్
ఆర్టికల్ 371-డీని సవరించకుండా విభజన చేయరాదని రాష్ట్రపతిని కోరినట్టు వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు. అసెంబ్లీ తీర్మానం తర్వాతే రాష్ట్ర విభజన జరగాలని చెప్పినట్టు అన్నారు. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతిని కలసిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విభజించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్టు తెలిపారు. విభజన జరిగితే సీమాంధ్ర ప్రాంతంలో తాగటానికి కూడా నీరు ఉండదని చెప్పామని అన్నారు. సమైక్యాంధ్ర, ఆర్టికల్ 3 గురించి తెలియజేశామని చెప్పారు. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని జగన్ అన్నారు.