: జగన్ చేపట్టిన యాత్రలు సమైక్యం కోసం కాదు: వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ చేపట్టిన యాత్రలు సమైక్య రాష్ట్రం కోసం కాదన్నారు. తన కేసులకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయడానికే ఆయన జాతీయ నేతలను కలుస్తున్నారని చెప్పారు. వీహెచ్ ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. జగన్ విషయంలో తాను గతంలో చెప్పిందే, ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారన్నారు. ఎంతో పలుకుబడి ఉన్న చంద్రబాబు, ఇప్పటికైనా జగన్ నిజస్వరూపాన్ని ఢిల్లీ స్థాయిలో ఎండగట్టాలని సూచించారు. 2004లో జగన్ ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత? అనే విషయాన్ని ఊరూరా తిరిగి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. ఓదార్పు యాత్రకు వెళ్లినప్పుడే లగడపాటి, రాయపాటి అడ్డుకుని ఉంటే ఇప్పుడు జగన్ ఉండేవాడే కాదన్నారు.