: ప్రతిష్ఠాత్మక సీఏఎస్ గౌరవ విదేశీ సభ్యుడిగా సీఎన్ఆర్ రావు


ఇటీవల భారతరత్న పురస్కారానికి ఎంపికైన ప్రముఖ శాస్త్రవేత్త సీఎన్ఆర్ రావు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ (సీఏఎస్) లో గౌరవ విదేశీ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు సీఎన్ఆర్ రావు కావటం విశేషం. ప్రతిష్ఠాత్మకమైన ఈ అకాడమీలో పలువురు నోబెల్ బహుమతి విజేతలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఉన్నారని బెంగళూరులోని 'జవహర్ లాల్ నెహ్రు సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్' సంస్థ తెలిపింది. ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావు ఈ సంస్థకు గౌరవ అధ్యక్షుడుగా ఉన్నారు. ఈ నెల 4వ తేదిన సమావేశమైన సీఏఎస్ సర్వప్రతినిధి సభ సీఎన్ఆర్ రావును ఎన్నుకుందని ఈ సంస్థ పేర్కొంది. 2012 జనవరిలో అంతర్జాతీయ వైజ్ఞానిక సహకార పురస్కారాన్ని కూడా అందించిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక శాస్త్రీయ అకాడమీల్లో ఆయనకు సభ్యత్వం ఉందని వివరించింది.

  • Loading...

More Telugu News