: మధ్యప్రదేశ్, ఢిల్లీలో నేడు మోడీ ఎన్నికల ప్రచారం


భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ఈ రోజు మధ్యప్రదేశ్ లోని రెండు ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మండ్సార్, ఉజ్జెయిని జిల్లాలలో ఏర్పాటు చేసిన రెండు సభల్లో మాట్లాడతారు. ఈ రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం పోలింగ్ జరగబోతోంది. శనివారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. అలాగే, మోడీ సాయంత్రానికి ఢిల్లీ వెళ్లి అక్కడొక సభల్లో పాల్గొంటారు. ఢిల్లీ అసెంబ్లీకి డిసెంబర్ 4న పోలింగ్ జరుగుతుంది.

  • Loading...

More Telugu News