: 'ప్యాకేజ్' అన్న పదాన్ని పత్రికల్లో ఉపయోగించకూడదు: బొత్స
రాష్ట్ర విభజన నేపథ్యంలో 'ప్యాకేజ్' అనే పదాన్ని ఈ మధ్య తరచూ వింటున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పదంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేట్ విధానంలో వాడే 'ప్యాకేజ్' అనే పదాన్ని.. పత్రికల్లో ఉపయోగించకూడదని విజయనగరంలో అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష అని, శాసనసభలో విభజన బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారు.