: పుట్టపర్తిలో నేడు సత్యసాయి జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నేడు సత్యసాయి 88వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనికోసం సత్యసాయి ట్రస్టు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 1926 నవంబర్ 23వ తేదీన సత్యసాయి జన్మించారు. జయంతి సందర్భంగా ఆయన పేరు మీద ఐదు లక్షల విలువైన పోస్టల్ స్టాంపును కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి పుట్టపర్తిలో విడుదల చేయనున్నారు. అంతేగాక 80 కోట్ల రూపాయలతో చేపట్టిన మంచినీటి పథకాన్ని కూడా సత్యసాయి ట్రస్టు ప్రారంభించనుంది.