: ముగిసిన ఆనంద్ శకం... కొత్త ప్రపంచ ఛాంపియన్ కార్ల్ సన్


ప్రపంచ చెస్ చరిత్రలో విశ్వనాథన్ ఆనంద్ శకం ముగిసింది. ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి, ఆరేళ్లపాటు చెస్ రారాజుగా వెలుగొందిన ఆనంద్... ఇప్పుడు సొంత గడ్డ మీద పరాజయం పాలయ్యాడు. 43 ఏళ్ల ఆనంద్ కేవలం 22 ఏళ్ల వయసున్న నార్వే కుర్రాడు మాగ్నస్ కార్ల్ సన్ చేతిలో చిత్తయ్యాడు. విశ్లేషకులంతా ఆనంద్ గెలుస్తాడని భావించినా... కార్స్ సన్ అద్భుత ఆటతీరు ముందు ఆనంద్ నిలువలేకపోయాడు.

చెన్నైలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో కార్ల్ సన్ 6.5-3.5 తేడాతో ఆనంద్ పై విజయకేతనం ఎగురవేశాడు. తప్పక గెలవాల్సిన పదో గేమ్ లో ఆనంద్ డ్రాతో సరిపెట్టుకోవడంతో, కార్ల్ సన్ సరికొత్త ఛాంపియన్ గా అవతరించాడు. ప్రపంచ ఛాంపియన్ షిప్ గెలిచిన కార్ల్ సన్ కు రూ. 8.4 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ గా నిలిచిన ఆనంద్ రూ. 5.6 కోట్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News