: ఇకపై దేవుడికి కొబ్బరికాయ కొట్టడం కూడా కష్టమే


హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకున్న స్థానం అందరికీ తెలిసిందే. ఇంట్లో పూజైనా, దేవాలయంలో పూజైనా లేక మరే కార్యక్రమమైనా కొబ్బరికాయ ఉండాల్సిందే. ఇప్పుడు ఈ కొబ్బరికాయల ధరలు ఆకాశాన్నంటబోతున్నాయి. ఎందుకంటే కోస్తా ప్రాంతంపై విరుచుకుపడిన హెలెన్ తుపాను, కొబ్బరి చెట్లపై తన ప్రభావాన్ని చూపింది. ఒక్క కోనసీమలోనే దాదాపు 60 వేల కొబ్బరి చెట్లు నేలకూలాయనేది ప్రాథమిక అంచనా. ఈ సంఖ్య మరింత పెరగనుంది. మిగిలిన చెట్లకు కూడా మొవ్వు, తలభాగం కదిలిపోయాయని రైతులు వాపోతున్నారు. దీంతో, ఈ చెట్లకు దిగుబడి రావడం కూడా కష్టమే. ఈ చెట్ల స్థానంలో కొత్త మొక్కలను నాటితే... కాపు రావడానికి ఎనిమిది సంవత్సరాల సమయం పడుతుంది. దీంతో, డిమాండ్ కు సరిపడా కొబ్బరికాయలు సప్లై కావడమనేది కష్టసాధ్యమైన విషయం. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల ధరలు చుక్కలనంటబోతున్నాయి.

  • Loading...

More Telugu News