: బస్టాండ్ లో బంగారం వ్యాపారి బ్యాగ్ మాయం
నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో బంగారం వ్యాపారి బ్యాగ్ మాయమైంది. బ్యాగ్ లో 10 కిలోల బంగారం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యాపారి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.