: 25న నారింజ రంగును ధరించండి!


ఇది ఐక్యరాజ్య సమితి ఇస్తోన్న పిలుపు. మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మహిళలపై హింస పెరిగిపోతున్న నేపధ్యంలో ప్రతి నవంబరు 25న ఐక్యరాజ్య సమితి తన సభ్యదేశాలన్నింటితోను, పౌరసంఘాలతోను కలిసి ఇందుకోసం ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో మనదేశం కూడా పాలుపంచుకోనుంది.

నవంబరు 25న మహిళలపై హింసా నిర్మూలనా దినంగా పాటిస్తూ 25 నుండి డిసెంబరు 10 వరకూ అంటే... అంతర్జాతీయ మానవ హక్కుల దినం వరకూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ ఏడాది 'ప్రపంచాన్ని 16 రోజుల్లో నారింజ రంగుతో నింపేయండి' అనే అంశంపై కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందువల్ల అమ్మాయిలేకాదు మహిళలను గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకరకంగా నారింజ రంగును ధరించాలని ఐక్యరాజ్యసమితి కోరుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 35 శాతం మంది మహిళలు శారీరక, లైంగిక దాడులకు గురవుతున్నారని, ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వేధింపులతో బాధపడుతోందని, కొన్ని దేశాల్లో అయితే వేధింపులకు గురయ్యే వారి సంఖ్య 70 శాతంకన్నా ఎక్కువగానే ఉందని, మహిళలపై ఈ హింసను రూపుమాపేందుకు కలసి కట్టుగా పోరాడదాం రమ్మని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది.

  • Loading...

More Telugu News