: వైఎస్సార్ పార్టీలోకి మరో సిట్టింగ్ ఎమ్మెల్సీ
సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఆయన కుమారుడు వెంకట రమణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఓసారి జైల్లో జగన్ ను కలిశారని.. టీడీపీ, భాస్కర రామారావుపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా, హైదరాబాద్ లోటస్ పాండ్ లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.