: క్యాన్సరును నివారించే మందు ఖరీదు తక్కువేనట


సాధారణంగా క్యాన్సర్‌ను నివారించే మందులు చాలా ఎక్కువ ఖరీదు కలిగినవిగా ఉంటాయి. అలాకాకుండా తక్కువ ధరకు లభించేలా క్యాన్సర్‌ నివారణ మందును అందుబాటులోకి తేనున్నారు. ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడేవారికోసం కొత్తరకం మందును ఫార్మాకంపెనీ కేడిలా ఆవిష్కరించింది. ఈ మందు తక్కువ ధరకే లభ్యమవుతుందని కంపెనీవారు చెబుతున్నారు.

మైసిడాక్‌ సీ అనే పేరుగల ఈ మందు పది ఇంజక్షన్ల కోర్సును కలిగినదని, దీని ధర కేవలం రూ.40 వేలు మాత్రమేనని కేడిలా ఛైర్మన్‌ రాజీవ్‌ మోదీ తెలిపారు. లంగ్‌ కేన్సర్‌ నివారణకు ఇతర మల్టీ నేషనల్‌ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న మందులతో పోలిస్తే మైసిడాక్‌ సీ ధర దాదాపుగా తొమ్మిది రెట్లు తక్కువగా ఉంటుందని మోదీ తెలిపారు. ఈ ఔషధాన్ని తయారుచేయడానికి తమ సంస్థ దాదాపుగా 15 సంవత్సరాలపాటు కృషి చేసిందని, ఈ ఔషధానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుండి అనుమతి కూడా లభించిందని, ఈ డిసెంబరునుండే దాదాపుగా యాభై దేశాల్లో ఈ మందును మార్కెట్లోకి విడుదల చేయనున్నామని మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News