: పప్పులు తింటే తిప్పలు తప్పుతాయట


పప్పులు ఏవైనా సరే రోజూ కాసిన్ని తింటే మనం ఆరోగ్యంగా ఉంటామట. జీడిపప్పు, బాదంపప్పు ఇలా ఏవైనాసరే... రోజూ ఓ గుప్పెడు పప్పులు తినమని పరిశోధకులు సలహాలిస్తున్నారు. హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, బ్రిగమ్‌లోని డానా-ఫార్బర్‌ కేన్సర్‌ ఆసుపత్రి పరిశోధకులు నిర్వహించిన తాజా పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా ఇలా ఏదైనా సరే రోజూ ఓ గుప్పెడు పప్పులు తినేవారిలో జీవితకాలం పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మామూలుగా ఎలాంటి పప్పులు తినని వారితో పోల్చితే రోజూ పప్పులు తినేవారిలో మరణాల సంఖ్య ఇరవై శాతం తక్కువగా ఉందట. అంతేకాదు, ఇలా పప్పులు తినేవారు నాజూగ్గా ఉంటారట. తిననివారిలో గుండెపోటు, టైప్‌-2 డయాబెటిస్‌, మూత్రపిండాల్లో రాళ్లు చేరడం వంటి సమస్యలతో సతమతమవుతుంటారని, అలాకాకుండా పప్పులు లాగించేవారికి ఇలాంటి సమస్యలు దరిచేరవని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి రోజూ కాసిన్ని పప్పులను లాగించేసి హాయిగా ఆరోగ్యంగా ఉండండి.

  • Loading...

More Telugu News