: నిద్రపోకుంటే ఛస్తారు!


ఇదేమీ బెదిరింపు కాదు... హెచ్చరిక మాత్రమే. మీరు కంటినిండా నిద్రపోకుంటే తొందరగా చావుకు చేరువవుతారు. ఈ విషయం పరిశోధకుల అధ్యయనాల్లో వెల్లడైంది. ఎక్కువగా పురుషుల్లో ఇలా నిద్రలేమితో బాధపడేవారే గుండెజబ్బులతో మరణించినట్టు ఈ అధ్యయనంలో తేలింది. సాధారణంగా మగవారిలో ఇన్‌సోమ్నియా (నిద్రలేమి) ఎక్కువగా ఉంటుంది. నిద్రపట్టడంలో ఇబ్బంది, నిద్ర మధ్యలో మెలకువ వస్తే తిరిగి నిద్రపట్టకపోవడం వంటి లక్షణాలు మనల్ని మరణానికి చేరువ చేయడానికి సంబంధం కలిగివున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

బ్రైగమ్‌ అండ్‌ వుమెన్స్‌ ఆసుపత్రికి చెందిన యాన్‌పింగ్‌ లీ మాట్లాడుతూ గుండె ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనదని, అయితే ఈ నిద్ర అనేది మన జీవిత కాలంపై కూడా ప్రభావం చూపుతుందని, సరిగా నిద్రపోకుంటే మనకు జబ్బులు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి చక్కగా కంటినిండా నిద్రపోండి. నిద్రసరిగా పట్టకుంటే వెంటనే డాక్టరును సంప్రదించి తగిన సూచనలను పాటించి తగినంత నిద్రపోయి మీ జీవితకాలాన్ని పొడిగించుకోండి.

  • Loading...

More Telugu News