: ప్రేమ పేరుతో వల విసిరి.. ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్టు


మహారాష్ట్రలోని యవత్ మల్ ప్రాంతంలో లలిత్ అరుణ్ గాజ్ భయ్యే(25) అనే వ్యక్తి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నఓ విద్యార్థినిని ప్రేమపేరుతో వంచించాడు. ప్రేమించుకుంటున్నాం కదా ఏకాంతంగా గడుపుదాం.. అంటూ హోటల్ గదికి తీసుకువెళ్లి, అసభ్య భంగిమల్లో ఫోటోలు తీసి.. బ్లాక్ మెయిల్ కు పాల్పడి 90 వేల రూపాయలు వసూలు చేశాడు. మరో పది లక్షలు ఇస్తే వదిలేస్తానని అతని మిత్రుడు రత్నకుమార్ గుప్తా(41)తో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం వివరించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

  • Loading...

More Telugu News