: మహిళలకు లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ శుభాకాంక్షలు


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎటువంటి సమయంలోనైనా మహిళలు ధైర్యంగా, సాహసోపేతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

దీక్ష, పట్టుదలతో మహిళలు కష్టాలను ఛేదించి విజయాలను సాధించాలన్నారు. కాగా, మహిళల భద్రత, గౌరవం, రాజకీయ, ఆర్ధిక, సామాజిక స్వావలంభన కోసం పార్లమెంట్ కట్టుబడి ఉందని మీరాకుమార్ తెలిపారు.  

  • Loading...

More Telugu News