: ఆ ఎస్సై కామాంధుడు.. నన్ను రక్షించండి: హెచ్చార్సీని వేడుకున్న మహిళ


తనను ఎస్సై లెనిన్ బాబు నుంచి రక్షించాలంటూ ఓ మహిళ హైదరాబాద్ లోని హెచ్ఆర్సీని ఆశ్రయించింది. మెదక్ జిల్లా దుబ్బాక మండలానికి చెందిన ఓ మహిళ, ఎస్సై లెనిన్ బాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా, లెనిన్ బాబు నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని, తనకు రక్షణ కల్పించాలని కోరింది. ఈ ఫిర్యాదు స్వీకరించిన హెచ్చార్సీ విచారణ జరిపించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News