: మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్


పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రెండు వారాల పాటు ప్రశాంతంగా ఉన్న పాక్ బలగాలు, ఈ రోజు మళ్లీ తమ వంకర బుద్ధిని ప్రదర్శించాయి. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వద్ద ఉన్న మెంధర్ సెక్టార్లో ఈ సాయంత్రం కాల్పులకు తెగబడ్డాయి. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే పాక్ బలగాలు ఆటోమేటిక్, చిన్న ఆయుధాలతో కాల్పులు జరుపుతున్నాయని... తాము కూడా అలాంటి ఆయుధాలతోనే తిప్పికొడుతున్నామని... ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News