: 'దేశంలో ఎన్టీఆరే గొప్ప నటుడు'
నందమూరి తారక రామారావు దేశంలోనే అత్యుత్తమ నటుడిగా నిలిచారు. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఓ చానెల్ నిర్వహించిన ఎన్నికల్లో అత్యధికులు ఎన్టీఆర్ కు ఓటేశారు. గత, ప్రస్తుత సినిమాలన్నింటినీ కలుపుకొని ఈ ఎన్నిక జరిగింది. గొప్ప నటుడిగా ఎన్టీఆర్ 53 శాతం ఓట్లు దక్కించుకోగా, 42 శాతం ఓట్లతో కమల్ హాసన్ రెండో స్థానంలో నిలిచారు.
గొప్ప చిత్రం కేటగిరిలో 'నాయకుడు' ప్రథమ స్థానంలో, 'షోలే' ద్వితీయ స్థానంలో నిలిచాయి. గొప్ప నటి విభాగంలో శ్రీదేవి ప్రథమ స్థానంలోనూ మాధురీ దీక్షిత్, సావిత్రి రెండు, మూడు స్థానాల్లోనూ నిలిచారు. గొప్ప సంగీత దర్శకుడిగా ఇళయరాజా నిలవగా రెండో స్థానాన్ని ఏ.ఆర్.రెహ్మాన్ దక్కించుకున్నారు.