: నిరాధారాలతోనే నా మీద 81 కేసులు పెట్టారు: బాబా రాందేవ్


యోగా గురువు బాబా రాందేవ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సరైన ఆధారాలు లేకుండానే ఉత్తరాఖండ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం తనపై 81 కేసులు పెట్టిందని విమర్శించారు. ఉత్తరాఖండ్ లోని బాబా రాందేవ్ 'పతాంజలి యోగపీఠం'పై... భూమి చట్టాలను అతిక్రమించడం, స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టడం లాంటి నేరాలపై ఈ కేసులను నమోదుచేశారు. దీనిపై రాందేవ్ స్పందిస్తూ, అవినీతిలో కేంద్ర ప్రభుత్వం రికార్డులు బద్దలుగొట్టిందని, ఓ సాధువుపై 81 కేసులు పెట్టి ఉత్తరాఖండ్ సీఎం సరికొత్త రికార్డును నమోదు చేశారని ఎద్దేవా చేశారు. చేతనైతే సోనియా, రాహుల్, ఉత్తరాఖండ్ సీఎం విజయ్ బహుగుణలు తనతో బహిరంగ చర్చకు సిద్ధంకావాలని డిమాండ్ చేశారు. మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతోందని రాందేవ్ జోస్యం చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ హిమాలయ పర్వతమైతే... రాహుల్ గాంధీ ఓ చీమలాంటి వాడని అన్నారు.

  • Loading...

More Telugu News