: లాడెన్ అల్లుడు సులేమాన్ అబూ గేత్ అరెస్టు


అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ అల్లుడు సులేమాన్ అబూ గేత్ ను అమెరికా ఫెడరల్ అధికారులు జోర్డాన్ లో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని అధికారులు గురువారం వెల్లడించారు. సులేమాన్ అరెస్టు..  తీవ్రవాదంపై అమెరికా సాగిస్తున్న పోరులో ఓ ముఖ్య పరిణామమన్నారు.

అతన్నిశుక్రవారం న్యూయార్క్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చనున్నట్లు అటార్నీ జనరల్ హెరిక్ హోల్డర్ తెలిపారు. అమెరికా పౌరులను చంపిన కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న సులేమాన్ గతంలో అల్ ఖైదా మీడియా ప్రతినిధిగా పని చేశాడు.

9/11 దాడులకు వ్యూహాలు పన్నడంలో పాలుపంచుకున్న సులేమాన్.. ఆ దాడుల మరుసటి రోజు  అమెరికాను హెచ్చరిస్తూ అల్ జజీరా చానల్ లో ప్రకటనలు కూడా చేశాడు. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం సులేమాన్ పై నిఘా వేసింది.

  • Loading...

More Telugu News